Tandur: నిజాయితీ మా స్థాయి.. దొంగ లెక్కలు మీ స్థాయి: బీఆర్ఎస్ నేత!

Tandur: యాలాల పీఏసీఎస్ గోదాం రైస్ మిల్ మిషనరీ అవకతవకలపై పూర్తి విచారణ జరపాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Srikanth Reddy, Tandur
Published on: 4 Oct 2026 9:36 PM IST
Tandur
X

Tandur: నిజాయితీ మా స్థాయి.. దొంగ లెక్కలు మీ స్థాయి: బీఆర్ఎస్ నేత!

తాండూర్: యాలాల మండలంలో పి ఏ సి ఎస్ గోదాం రైస్ మిల్ మిషనరీ అవకతవకలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని బి ఆర్ ఎస్ యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మండల పరిధిలోని దౌలాపూర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిర్వహించారు.

ఈ సందర్బంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మండల పరిధిలో జరుగుతున్న రాజకీయాలను ప్రతి ఒక్కరు గమనిస్తున్నారన్నారు. ప్రతి వ్యక్తికి ఎవరు నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నారో తెలిసునన్నారు. దళిత బంధు విషయంలో మండల పరిధిలోని కొందరు ముఖ్య నాయకులు అవాక్కులు చవక్కులు పేలడం జరిగిందన్నారు. వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత పక్షపాతిగా దళిత బంధు ఇచ్చిన ఘనత వారికే దక్కిందన్నారు. దళిత బంధు మంజూరు చేయడంలో తాను డబ్బులు తీసుకున్నానని అపవాదు మోపారన్నారు. తాను డబ్బులు తీసుకున్నట్లు సాక్షాలతో సహా బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. దళిత బంధు లబ్ధిదారునికి తుఫాన్ వాహనం కొనుగోలు కోసం తాను తన చేతిలో నుండి రెండు లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. తాను ఒకరికి సహాయం చేస్తే గుణమే కానీ ఒకరి దగ్గర చేయి చాచి అలవాటు తనకు లేదన్నారు.

ఇసుక అక్రమ రవాణా విషయంలో కొంతమంది నాయకులు తనకు, సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి సిద్రాల శ్రీనివాస్ కు డబ్బులు అందిస్తామని తెచ్చుకొని తమ సొంతవానికి వాడుకోవడం జరిగిందన్నారు. ఆ పాపపు సొమ్ము తాము తమకు ఇచ్చిన తీసుకునే వారిమి కాదన్నారు. మా పేర్లు చెప్పి డబ్బులు తీసుకున్న నాయకులకు వారి తాహత ఎంతో వారే అర్థం చేసుకోవాలన్నారు. ఆది వాళ్ల విజ్ఞతకే వదిలి వేస్తున్నామన్నారు.

వినాయక చవితి రోజు చంద్రుని చూస్తే ఏ విధంగా అపవాదులు వస్తాయో ఆ విధంగా తమపై మోపిన నిందలను మంచి మనసుతో స్వీకరించి వారిని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నామన్నారు. మండల పరిధిలోని కొన్ని గ్రామపంచాయతీలలో ఉన్న ఇసుక ద్వారా ఆ గ్రామపంచాయతీకి ఆర్థికంగా లాభం చేకూరుతుందన్నారు తద్వారా ఆ గ్రామపంచాయతీ నిధులతో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారన్నారు. అలాకాకుండా కొందరు నాయకులు పని కట్టుకొని మోరo ఇసుక అక్రమ రవాణాకు తెరతీయడంతో గ్రామపంచాయతీల ఎదుగుదలకు గొడ్డలిపెట్టుగా మారారన్నారు. అధికార పక్షం చేస్తున్న మంచి చెడులను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా ప్రజలు మాకు అందించారన్నారు.

ఏ విషయాన్ని అయినా ప్రజల ముందుంచి మంచి,చెడులను వారి ద్వారానే నిర్ణయించుకుంటామన్నారు. ప్రతిపక్షంగా మా పని మేము చేస్తూ ఉంటే కొందరు మాపైన అబాండాలు మోపడమే పనిగా పెట్టుకున్నారు అని అన్నారు. నేను ఎవరికి కూడా ఒక రూపాయి కూడా బాకీ లేనన్నారు. నిజాయితీగా బతకడమే తమస్థాయని దొంగ లెక్కలు చేయడం మీ స్థాయి అన్నారు. ఇన్ని సంవత్సరాలు ప్రజల మీద పడి దోచుకున్నది చాలు అన్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలన్నారు. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారన్నారు. ప్రజల కొరకు మీరు పని చేయాలన్నారు.

మనందరం ప్రజల కొరకు పని చేయాలిగాని అనవసరమైన రాద్ధాంతాలు చేయడం మానుకోవాలి అన్నారు. ప్రజా సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావడం మా బాధ్యత అన్నారు. ఎమ్మెల్యే కు ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నామన్నారు. వారు మాట్లాడరని మేము మాట్లాడామని చూడకుండా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా కోరుతున్నామన్నారు.

రాజేశ్వరి మేడం ఎంక్వయిరీ కోసం వచ్చి రికార్డును పూర్తి స్థాయిలో పరిశీలించి తప్పులను రాసి కలెక్టర్ కు సబ్మిట్ చేయడం జరిగిందన్నారు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేస్తే దానిని తొక్కి పట్టి ఇప్పటివరకు సాగదీస్తూ పోతున్నారన్నారు. 6 మందికి ఇచ్చిన నోటీసుల వివరాలు తెలుసుకోవడం కోసం మళ్లీ ఎంక్వయిరీ కోసం మళ్లీ వస్తున్నారన్నారు. రిపోర్టు తీసుకున్న తర్వాత దాన్ని నేను పై అధికారులకు పంపించి నెల రోజుల్లో పూర్తిస్థాయి విచారణ జరిగే విధంగా చేస్తామన్నారు. రైతుల పైసలతో నిర్మితమైన గోదాం రైస్ మిల్ రైతులకు ఉపయోగపడకపోతే ఎందుకన్నారు. ఇప్పటికీ మూడు కిస్తులు రైతుల పైసల్ని కట్టడం జరిగిందన్నారు. మిషన్లకు పైసలు ఇవ్వలేదని చెప్తున్నా మాజీ చైర్మన్ మా వద్ద ఉన్న మిషనరీ ల కోసం అందించిన చెక్కులకు సంబంధించి సమాధానం చెప్పాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 19 రోజులు గడవగానే ఈ చెక్కులు రావడం జరిగిందన్నారు. మరి అవినీతి మా పాలన సమయంలో జరిగిందా లేక మీ పాలన సమయంలో జరిగిందా గ్రహించాలన్నారు. పిఎసిఎస్ చైర్మన్ పదవి కోసం ఎవరు ఎవరు కాళ్లు మొక్కరో మీకు నాకు తెలుసు అన్నారు.

ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ వడ్డే రాములు సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి,అరవింద్ రెడ్డి , మాజీ సర్పంచ్ పటేల్ రెడ్డి , కృష్ణ గణేష్, శరణభూపాల్ తదితరులు పాల్గొన్నారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur