Hyderabad: భగత్‌నగర్ అమ్మవారి మండపంలో ప్రత్యేక పూజలు పాల్గొన్న సోమశేఖర్‌రెడ్డి!

Hyderabad: ఏఎస్‌ రావునగర్‌ డివిజన్‌ జమ్మిగడ్డ భగత్‌నగర్‌లో అమ్మవారిని దర్శించుకున్న బీఆర్‌ఎస్‌ నేత సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి. అన్నదాన కార్యక్రమం ప్రారంభం.

ASHOK, KAPRA
Published on: 16 Oct 2026 6:44 PM IST
Hyderabad
X

Hyderabad: భగత్‌నగర్ అమ్మవారి మండపంలో ప్రత్యేక పూజలు పాల్గొన్న సోమశేఖర్‌రెడ్డి!

Hyderabad: ఏఎస్‌ రావునగర్‌ డివిజన్‌ పరిధిలోని జమ్మిగడ్డ భగత్‌నగర్‌లో వజ్ర యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన అమ్మవారి మండపంలో శుక్రవారం ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు సమాజంలో ఐక్యత, సోదర భావాన్ని బలోపేతం చేస్తాయని అన్నారు. పండుగలు, ఉత్సవాల సందర్భంగా యువత ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. అన్నదానం గొప్ప సేవా కార్యక్రమమని, ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఎంతో పుణ్యప్రదమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సేవాభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. వజ్ర యువజన సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు భక్తులకు అన్నప్రసాదం అందించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వజ్ర యువజన సంఘం సభ్యులు జోగిని శిరీష, ఉడుత శివ, సందీప్, శ్రీనివాస్, సాయి, రాజు, శివ, సురేష్, శేఖర్, చింటూ, చరణ్, కిషోర్, రోహిత్, గౌతమ్, గణేష్, రోహిత్, జశ్వంత్, స్థానిక నాయకులు సత్యమ్మ, రహీం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA