Kukatpally: కూకట్‌పల్లిలో వినాయకుడికి బీఆర్‌ఎస్ నేత వినతిపత్రం!

Kukatpally: కూకట్‌పల్లిలో వినాయకుడికి వినతిపత్రం సమర్పించిన బీఆర్‌ఎస్ నేత రఘునందన్ నేత.. రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన.

Maruthisagar, Kukatpally
Published on: 18 Sept 2026 1:25 PM IST
Kukatpally
X

Kukatpally: కూకట్‌పల్లిలో వినాయకుడికి బీఆర్‌ఎస్ నేత వినతిపత్రం!

Kukatpally: రాష్ట్రంలో ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు కొనసాగుతున్నాయంటూ ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ నాయకుడు పి. రఘునందన్ నేత కూకట్‌పల్లి గుడ్‌షెడ్‌ రోడ్డులోని వినాయకుడికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగత అంశాలపై చర్చించడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రైతులు, కార్మికులు, వివిధ వర్గాల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించేలా పాలకులకు సద్బుద్ధి కలిగించాలని, రాష్ట్రంలో ఉన్న విఘ్నాలను తొలగించి ప్రజలకు మంచి పాలన అందేలా చూడాలని విఘ్నేశ్వరుడిని కోరినట్లు రఘునందన్ నేత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం. రామ్మోహన్ రావు, ఏ.శ్రీధర్, కె. కౌశిక్, రమేష్, రామారావు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally