Kalwakurthy: కల్వకుర్తిలో కరెంటు సెగ: కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ ధ్వజం!
Kalwakurthy: కల్వకుర్తి నియోజకవర్గంలో విద్యుత్ కోతలతో ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ నేతలు జైపాల్ యాదవ్, దశరథ్ నాయక్ పరిశీలించారు.
Kalwakurthy: కల్వకుర్తిలో కరెంటు సెగ: కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ ధ్వజం!
కల్వకుర్తి: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అప్రకటిత కరెంటు కోతలు, లో-వోల్టేజీ సమస్యలతో అన్నదాతల బతుకులు అంధకారంలోకి నెట్టబడుతున్నాయని కల్వకుర్తి నియోజకవర్గంలో నిరసన జ్వాలలు మిన్నంటాయి.
కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్,మాజీశాసనసభ్యులు గుర్కా జైపాల్ యాదవ్ గారు కడ్తాల్ మాజీ జెడ్పీటీసీ, రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్పుల దశరథ్ నాయక్ తో కలిసి ముద్విన్ గ్రామంలో కరెంటు కోతలతో పూర్తిగా ఎండిపోయిన వరి పంటలను ఇద్దరు నేతలు క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులకు తామున్నామంటూ కొండంత భరోసా ఇచ్చారు.
మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఎన్నికల వేళ 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్ అంటూ దగామాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, నేడు కనీసం 7 గంటల నిరంతర సరఫరాను కూడా ఇవ్వలేక చేతులెత్తేసిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలనలో కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని దౌర్భాగ్య స్థితి నెలకొందని ధ్వజమెత్తారు. కరెంటు కోతల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరాకు 25,000 చొప్పున తక్షణమే ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
రైతుల పక్షాన నిలబడి, అసెంబ్లీ సాక్షిగానైనా, ప్రజా క్షేత్రంలోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తీరుతామని ఆయన హెచ్చరించారు. కడ్తాల్ మాజీ జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో కరెంటు కష్టాలు మళ్లీ మొదలయ్యాయని, ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగలడం ఖాయమని హెచ్చరించారు.
ముఖ్యంగా గిరిజన తండాలు, దళిత, వెనుకబడిన వర్గాల రైతులు లో-వోల్టేజీ సమస్యలతో తీవ్రంగా నష్టపోతున్నారని, మోటర్లు మరియు సబ్ స్టేషన్ పరిధిలోని ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయి రైతన్నలు అప్పులపాలు అవుతున్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. అన్నదాతలకు పూర్తి న్యాయం జరిగే వరకు కల్వకుర్తి గడ్డపై విశ్రమించకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చేలా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్ డైరెక్టర్ వీరయ్య సర్పంచ్ నీలావతి లోకేష్ నాయక్ మాజీ సర్పంచులు యాదయ్య నరసింహ గౌడ్ భాగ్యమ్మ జంగయ్య ఉపసర్పంచ్ బాలు నాయక్ మాజీ ఉప సర్పంచ్ రామకృష్ణ వినోద్ నాయకులు గోపాల్ రాజు శీను పర్వతాలు వెంకటయ్య జంగయ్య సైదులు మహేష్ వెంకటేష్ శీను సత్తయ్య హరి నవీన్ పెంటయ్య నారయ్య కృష్ణయ్య రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.




