Chengicherla: చెంగిచెర్ల డిపో వద్ద హోరెత్తిన ఆర్టీసీ నిరసన

Chengicherla: చెంగిచెర్ల డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ధర్నాకు బీఆర్ఎస్ మద్దతు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల హామీలను తుంగలో తొక్కిందని మంద సంజీవరెడ్డి విమర్శ.

KARUNAKAR, UPPAL
Published on: 24 April 2026 5:57 PM IST
Chengicherla
X

Chengicherla: చెంగిచెర్ల డిపో వద్ద హోరెత్తిన ఆర్టీసీ నిరసన

Chengicherla: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని చెంగిచెర్ల బస్సు డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఘట్‌కేసర్ మాజీ జెడ్పిటిసి, బోడుప్పల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చూపుతోందని ఆయన ఆరోపించారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్మికులకు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయలేదని అన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు వారిని గాలికి వదిలేసిందని విమర్శించారు. తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న సమయంలో డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందడం తీవ్ర విషాదకరమని,

ఆయన మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ధర్నా అనంతరం బీఆర్ఎస్ నాయకులు శంకర్ గౌడ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ లక్ష్మి రవి గౌడ్, ఆర్టీసీ జేఏసీ చైర్మన్ నరసింహతో పాటు పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story