Secunderabad: మోండా మార్కెట్‌లో బీఆర్ఎస్ వినూత్న నిరసన!
Secunderabad: సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో ఆటోలు నడుపుతూ బీఆర్ఎస్ వినూత్న నిరసన. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఆకుల రూపా హరికృష్ణ ఆధ్వర్యంలో నిరసనలు.
Secunderabad: మోండా మార్కెట్‌లో బీఆర్ఎస్ వినూత్న నిరసన!
Secunderabad: సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌లో బీఆర్ఎస్ నేతలు ఆటో నడుపుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ఒరిగిందేమీ లేదని, తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపిస్తూ భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు.
మాజీ కార్పొరేటర్ ఆకుల రూపా హరికృష్ణ ఆధ్వర్యంలో, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు ఈ నిరసన చేపట్టారు. గులాబీ జెండా పాటలకు నృత్యాలు చేస్తూ మార్కెట్‌లో నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు.
అనంతరం ఫుట్‌పాత్‌పై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Next Story




