Vanasthalipuram: దాహంతో అల్లాడుతున్న వనస్థలిపురం.. జలమండలికి బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు!

Vanasthalipuram: వనస్థలిపురంలో తీవ్ర తాగునీటి సమస్య. నీటి ట్యాంకర్ల అక్రమ విక్రయాలపై జలమండలి అధికారులకు ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్ నేతలు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 10 Jun 2026 2:01 PM IST
Vanasthalipuram
X

Vanasthalipuram: దాహంతో అల్లాడుతున్న వనస్థలిపురం.. జలమండలికి బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు!

ఎల్బీనగర్: వనస్థలిపురం డివిజన్ పరిధిలో నెలకొన్న తీవ్రమైన మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బి.ఆర్.ఎస్ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షులు శ్రీ చింతల రవి కుమార్ గారి ఆధ్వర్యంలో జలమండలి డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం) శ్రీ నాగరాజు గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా చింతల రవి కుమార్ మాట్లాడుతూ, వనస్థలిపురం డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో తాగునీటి సరఫరా సక్రమంగా జరగకపోవడం, తక్కువ ఒత్తిడితో నీరు రావడం, సరఫరా సమయాలు పాటించకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు నిత్యావసరమైన తాగునీటి కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

అదేవిధంగా ప్రజల అవసరాల కోసం సరఫరా చేయాల్సిన నీటి ట్యాంకర్లను కొందరు వ్యక్తులు అక్రమంగా విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు ప్రజల నుండి వస్తున్నాయని, ప్రజల దాహాన్ని ఆసరాగా చేసుకుని నీటిని వ్యాపారంగా మార్చడం అత్యంత దురదృష్టకరమైన మరియు ఖండనీయమైన విషయమని పేర్కొన్నారు.

కావున వనస్థలిపురం డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలలో తక్షణమే పరిస్థితిని సమీక్షించి, అవసరమైన ప్రాంతాలకు అదనపు నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేయడంతో పాటు తగిన ఒత్తిడితో నిరంతరాయంగా మంచినీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులను కోరారు. అలాగే ట్యాంకర్ల ద్వారా నీటిని అక్రమంగా విక్రయిస్తున్న వారిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కొలిశెట్టి సంజయ్ కుమార్ గారు, వర్కింగ్ అధ్యక్షులు లగోని శ్రీధర్ గౌడ్ గారు, ప్రశాంతనగర్ కాలనీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు శ్రీనివాస పురం కాలనీ అధ్యక్షులు దూసరి మధు గౌడ్ గారు, ఫేస్2హుడాకాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనంద్ రాజ్ గారు, ప్రశాంత్ నగర్ ప్రధాన కార్యదర్శి బాబురావు గారు, గడాల రాజు గారు, పి.వి. నరసింహరావు గారు, మిట్ట రామ్మోహన్ గారు, శ్రీనివాసరావు గారు, అశోక్ గారు, రవికాంత్ గారు, ప్రకాష్ గారు, విజయ్ కుమార్ గారు తదితర నాయకులు, పార్టీ కార్యకర్తలు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు కాలనీ ప్రముఖులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story