Medipalli: సర్కారు బడులకు బీఆర్ఎస్ భరోసా.. విద్యా వాలంటీర్ల నియామకం!

Medipalli: మేడిపల్లి, పీర్జాదిగూడ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి బీఆర్ఎస్ నాయకులు అండగా నిలిచారు.

KARUNAKAR, UPPAL
Published on: 17 Jun 2026 7:37 AM IST
Medipalli
X

Medipalli: సర్కారు బడులకు బీఆర్ఎస్ భరోసా.. విద్యా వాలంటీర్ల నియామకం!

Medipalli: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించేందుకు బీఆర్ఎస్ నాయకులు ముందుకు వచ్చారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి, పీర్జాదిగూడ, పర్వతాపూర్ ప్రభుత్వ పాఠశాలలను మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు సందర్శించి అక్కడి సమస్యలను పరిశీలించారు.

పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఉపాధ్యాయుల కొరత ఉందని ప్రధానోపాధ్యాయులు వివరించగా, వెంటనే స్పందించిన జక్క వెంకట్ రెడ్డి మూడు పాఠశాలల కోసం మొత్తం ఆరుగురు విద్యా వాలంటీర్లను నియమించి వారికి ప్రతి నెల వేతనాలు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా మేడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో కొత్త కిచెన్ షెడ్ నిర్మాణం, పీర్జాదిగూడ, పర్వతాపూర్ పాఠశాలల్లో కిచెన్ షెడ్ల మరమ్మతులు చేపట్టనున్నట్లు ప్రకటించారు.

విద్యా వాలంటీర్ల వేతనాలు, కిచెన్ షెడ్ల నిర్మాణం, మరమ్మతుల బాధ్యతను మాజీ కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్ రెడ్డి, కొల్తూరి మహేష్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు ఆకుల మధుకర్, యాసారం శ్రీనివాస్, మునికుంట్ల కిరణ్ గౌడ్ స్వచ్ఛందంగా స్వీకరించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి బీఆర్ఎస్ నాయకులు ముందుకు రావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇది ఆదర్శప్రాయమైన చర్యగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు మనోరంజన్ రెడ్డి, సీనియర్ నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, యూత్ అధ్యక్షులు ప్రభు,

మైనారిటీ అధ్యక్షులు జిలాని పాషా, శ్యామల శ్రీనివాస్, ఆంజనేయులు, కోనేటి వెంకట్,బుల్లెట్ శంకర్, అశోక్, మల్లం వెంకటేష్ గౌడ్, పాశం నరేందర్ రెడ్డి, సతీష్, అమర్ పటేల్, రాజు శెట్టి, కోల శ్రీనివాస్, వరికల శ్రీనివాస్, కిరణ్ నాయక్, శ్రీనివాస్ రెడ్డి, అక్షిత్, తిరుమలేష్, రమేష్, శివరాజ్, సుభాన్, సురేష్, తదితర నాయకులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story