Secunderabad: సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ నిరసన జ్వాలలు

Secunderabad: కాంగ్రెస్ ఎన్నికల హామీల వైఫల్యానికి నిరసనగా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో బిఆర్ఎస్ శ్రేణులు 'యూత్ డిక్లరేషన్' పేపర్లను చింపి నిరసన వ్యక్తంచేశారు.

Srikanth, Secunderabad
Published on: 18 July 2026 11:13 AM IST
Secunderabad
X

Secunderabad: సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ నిరసన జ్వాలలు

Secunderabad: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన యూత్ డిక్లరేషన్ పేపర్లను చింపి తమ నిరసనను బిఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి భారీ ఎత్తున బిఆర్ఎస్ శ్రేణులు చలో సరూర్నగర్ కు ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి వెళ్లారు.

వందలాది మంది యువతతో పికెట్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేసి ర్యాలీగా బయలుదేరారు. ఇదే ఆరంభంగా కాంగ్రెస్ పార్టీపై యుద్ధం మొదలవుతుందని, అన్ని డిక్లరేషన్ లపై నిరసన తెలియజేస్తామంటూ కంటోన్మెంట్ సభ్యత్వాల ఇన్చార్జి మన్నే క్రిషన్ స్పష్టం చేశారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story