Secunderabad: అడ్డగుట్టలో బీఆర్ఎస్ వంట వార్పు.. కాంగ్రెస్ సర్కార్‌పై ఫైర్!

Secunderabad: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ కేటీఆర్ పిలుపుమేరకు సికింద్రాబాద్ అడ్డగుట్టలో ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు వంట వార్పు కార్యక్రమం చేపట్టారు.

Srikanth, Secunderabad
Published on: 4 Sept 2026 3:46 PM IST
Secunderabad
X

Secunderabad: అడ్డగుట్టలో బీఆర్ఎస్ వంట వార్పు.. కాంగ్రెస్ సర్కార్‌పై ఫైర్!

సికింద్రాబాద్: కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన వైపల్యాలను ఎండగడుతూ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు సికింద్రాబాద్ అడ్డగుట్టలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు.

రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతూ మోసపోయారని పద్మారావు గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదిలలో ఎంతో అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ హయాంలో అన్ని రంగాలలో వెనుకబడిపోయిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజల గొంతుకై తాము పోరాటం చేస్తామని పద్మారావు వెల్లడించారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలకు ఇవ్వవలసిన నిధులు కూడా మూడు సంవత్సరాల నుండి ఇవ్వడం లేదని దీనితో ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు ఆగిపోవడం జరిగిందని అన్నారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story