Medchal: జవహర్‌నగర్‌లో ఉద్రిక్తత కాంగ్రెస్ 420 హామీలపై బీఆర్ఎస్ నిరసన!

Medchal: మేడ్చల్ జవహర్‌నగర్‌లో కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. బాకీ కార్డుల పంపిణీని అడ్డుకోవడంతో మాజీ మేయర్ కావ్య మండిపడ్డారు.

PURENDAR, ALWAL
Published on: 2 Sept 2026 1:57 PM IST
Medchal
X

Medchal: జవహర్‌నగర్‌లో ఉద్రిక్తత కాంగ్రెస్ 420 హామీలపై బీఆర్ఎస్ నిరసన!

Medchal: ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన 420 హామీలను గుర్తు చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం జవహర్‌నగర్‌లో ఉద్రిక్తతకు దారితీసింది. 420 మీటర్ల బాకీ కార్డులను ప్రదర్శిస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ హామీల అమలుపై ప్రశ్నించారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రజలకు బాకీ కార్డులను అందిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. అయితే బీఆర్‌ఎస్‌ చేపట్టిన కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. బాకీ కార్డులను చించివేయడంతో పాటు తమ కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తిస్తూ నిరసన కార్యక్రమానికి ఆటంకం కలిగించారని మండిపడ్డారు.

అయినప్పటికీ బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా ప్రజలకు బాకీ కార్డులను అందిస్తూ 420 హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నుంచి ఎదురైన అడ్డంకులను అధిగమించి బాకీ కార్డులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు విజయవంతమయ్యాయని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకురాలు, జవహర్‌నగర్‌ మాజీ మేయర్ మేకల కావ్య మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై అధికార పార్టీ నాయకులు దౌర్జన్యానికి దిగడం సరికాదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చేపడుతున్న తమ కార్యకర్తల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ఆందోళన కలిగిస్తోందని అన్నారు.

పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే భావన తమలో కలుగుతోందని మేకల కావ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యలు, ప్రభుత్వ హామీల అమలుపై ప్రశ్నించే హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీల అమలుపై ప్రజల్లో అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని బీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు 420 హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL

Next Story