Kapra: కాంగ్రెస్ ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి!
Kapra: కాంగ్రెస్ హామీలు అమలు చేయాలని కాప్రా సర్కిల్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నేత సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా. పోలీసులు నేతలను అరెస్ట్ చేశారు.
Kapra: కాంగ్రెస్ ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి!
Kapra: అసెంబ్లీ గేటు వద్ద ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, నాయకులను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కాప్రా, నాచారం సర్కిల్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నాకు దిగారు, అనంతరం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని డివిజన్ల నాయకులు, కార్యకర్తలతో కలిసి కాప్రా సర్కిల్ డీసీకి వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాప్రా సర్కిల్ అధికారులు అధికార పార్టీకి, బీజేపీకి వంతపాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు కావాలనే తీసేస్తున్నారని అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ ఫ్లెక్సీల వైపు కూడా చూడటం లేదన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను రాజీనామా చేయమంటున్నారని కేసీఆర్ కు ఆరోగ్య సమస్యల వల్ల అసెంబ్లీకి రాకపోతే ఇంత రాద్దాంతం చేస్తారా అని ప్రశ్నించారు.
అలా అయితే ఏపీలో చంద్రబాబు నాయుడు, తమిళనాడులో జయలలిత కూడా వివిద కారణాల కారణంగా అసెంబ్లీకి వెళ్లలేదని గుర్తు చేశారు. 1000 రోజుల కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాప్ అయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారి డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు ఏనాడు పార్లమెంట్ పరిధిలో అడుగుపెట్టి అభివృద్ధి చేయలేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో పేదల భూములను 22ఏ కింద నిషేధిత భూముల జాబితాలో చేర్చి భారీ అవినీతికి తెరలేపారన్నారు. ప్రజలు తమ భూములను నిషేధిత జాబితా నుండి తొలగించుకోవడానికి అధికారుల చుట్టూ తిరుగుతున్నారని, అధికారులు ఒక్కొక్కరి వద్ద నుండి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోటి ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చి లక్షకోట్ల భారీ కుంభకోణానికి తెరలేపిందని సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాప్రా సర్కిల్ కార్యాలయం ముందు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. పోలీసులు ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి కుషాయిగూడ పోలీసు స్టేషన్ కు తరలించారు., ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు పన్నాల దేవేందర్ రెడ్డి ప్రభుదాస్ శ్రీనివాస్ రెడ్డి అంజయ్య కాసం మహిపాల్ రెడ్డి నవీన్ గౌడ్ బద్రుద్దీన్ ఇంద్రయ్య రహిం తదితరులు పాల్గొన్నారు




