Vikarabad: వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకుల ధర్నా
Vikarabad: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
Vikarabad: వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకుల ధర్నా
Vikarabad: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల్లో జన్మించిన ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు.
ఈ పథకాల ద్వారా పేద కుటుంబాలకు ఎంతో ఆర్థిక సహాయం అందేదని పేర్కొన్నారు.అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని వారు ఆరోపించారు.
ఎన్నికల సమయంలో కళ్యాణ లక్ష్మి కింద అందించే రూ.1,00,116కు అదనంగా తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రస్తుతం అసలు పథకం అమలుకే ఆటంకాలు కల్పించడం సరికాదన్నారు.
పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలు ఆర్థిక భారంగా మారుతున్న నేపథ్యంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎలాంటి జాప్యం లేకుండా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.అనంతరం బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆర్డీఓ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.




