Kondapur: భగ్గుమన్న బీఆర్‌ఎస్: గుంతల రోడ్ల వల్ల ప్రాణాలు పోతున్నాయని ధర్నా!
Kondapur: హైదరాబాద్ శేరిలింగంపల్లి, కొండాపూర్‌లో రోడ్ల దుస్థితిపై బీఆర్‌ఎస్ నాయకుడు అలాఉద్దీన్ పటేల్ ఆధ్వర్యంలో ధర్నా.
Kondapur: భగ్గుమన్న బీఆర్‌ఎస్: గుంతల రోడ్ల వల్ల ప్రాణాలు పోతున్నాయని ధర్నా!
కొండాపూర్: హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, కొండాపూర్ పరిధిలోని ప్రధాన రహదారులు తీవ్రంగా దెబ్బతిని, గుంతలమయంగా మారడంపై BRS పార్టీ నాయకులు అలాఉద్దీన్ పటేల్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా చేపట్టారు.
ఐటీ హబ్‌గా పేరుపొందిన కొండాపూర్ ప్రాంతంలో రోడ్లు అద్దవానంగా తయారవ్వడం వల్ల నిత్యం ప్రయాణించే వాహనదారులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని BRS నాయకులు మండిపడ్డారు. వర్షం పడితే గుంతల్లో నీళ్లు చేరి వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు శారీరకంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభత్వ నిర్లక్ష్యం వలన గుంతల రోడ్ల కారణంగా ఈరోజు ఉదయం కొండాపూర్ ఆర్టీఏ ఆఫీస్ వద్ద యాక్సిడెంట్ జరిగి ఒకరు దుర్మరణం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు..
రోడ్డు పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం ఆ నిధులను ఏం చేస్తోందని, నాణ్యమైన రోడ్లు ఎందుకు వేయడం లేదని నాయకులు ప్రశ్నించారు. సిఎంసీ అధికారులు వెంటనే స్పందించి నూతన రోడ్ల నిర్మాణం చేపట్టాలని, లేనిపక్షంలో నిరసనను విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.




