Tandur: తండాలను పంచాయతీలుగా చేసిన కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం!
Tandur: తాండూర్‌లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మీడియా సమావేశం. సెప్టెంబర్ 17న ప్రతి గిరిజన గ్రామంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయనున్నట్లు ప్రకటన.
Tandur: తండాలను పంచాయతీలుగా చేసిన కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం!
Tandur: గిరిజన తాండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్ది గిరిజనుల కళ్ళల్లో ఆనందం నింపిన కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి వారి సేవలను మరోసారి గుర్తు చేసుకోవడం జరుగుతుందని మండల బీఆర్‌ఎస్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి అన్నారు.
విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్ది, గిరిజనులకు ప్రత్యేక గుర్తింపు కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకే దక్కుతుందన్నారు. వారి ఘనతను గుర్తు చేసుకుంటూ ఈనెల17న ప్రతి గిరిజన గ్రామంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరుగుతుందన్నారు.




