Maheshwaram: మహేశ్వరంలో బీఆర్‌ఎస్ వంటావార్పు నిరసన!

Maheshwaram: ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహేశ్వరంలో బీఆర్‌ఎస్ నేతలు భారీగా వంటావార్పు నిరసన చేపట్టారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

K Sai, Maheswaram
Published on: 5 Sept 2026 10:58 AM IST
Maheshwaram
X

Maheshwaram: మహేశ్వరంలో బీఆర్‌ఎస్ వంటావార్పు నిరసన!

Maheshwaram: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కేంద్రంలో కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్ వంటావార్పు నిరసన.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహేశ్వరం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకుల నిరసన.

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు వంటావార్పు కార్యక్రమం.

మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేతల విమర్శలు.

మహేశ్వరం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకులు భారీగా వంటావార్పు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

“సీఎం డౌన్ డౌన్”, “వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన” అంటూ నినాదాలతో మండల కేంద్రాన్ని హోరెత్తించారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు మహిళలకు ఇచ్చిన పలు హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు.

మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్లు, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలా కాలం గడుస్తున్నా, ఎన్నికల హామీలు మాత్రం అమలుకు నోచుకోవడం లేదని మండిపడ్డారు.

మహిళల సంక్షేమం పేరుతో ఓట్లు అడిగిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలను నిరాశకు గురిచేస్తోందని విమర్శించారు.

ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్‌ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

K Sai, Maheswaram

K Sai, Maheswaram