Medchal: 1000 రోజుల్లో హామీలు ఏవి?: మేడ్చల్‌లో గులాబీ శ్రేణుల నిరసన
Medchal: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడిచినా హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ మేడ్చల్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు 'వంట వార్పు' నిరసన చేపట్టాయి.
Medchal: 1000 రోజుల్లో హామీలు ఏవి?: మేడ్చల్‌లో గులాబీ శ్రేణుల నిరసన
Medchal: ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడిచినా హామీల అమలును చేపట్టలేదని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 297, 298 డివిజన్ నాయకులు మండిపడ్డారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల అరాచక పాలనకు నిరసనగా BRS అధినేత కేసిఆర్, కేటీఆర్ పిలుపు మేరకు ఏడు రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా 3వ రోజు మేడ్చల్ జాతీయ రహదారి 44 పక్కన BRS శ్రేణులు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మేడ్చల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి చామకుర మహేందర్ రెడ్డి హాజరై కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. పెన్షన్ పెంపు, విద్యార్థులకు స్కూటీలు, పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ, రైతు భీమా, పెళ్లికి తులం బంగారం ఏమయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
పట్టణాలు పల్లెల్లోని అమాయక భూములను జీవో నంబర్ 22 ఏ జాబితాలో చేర్చి సామాన్యులను కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతుందని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని బిఆర్ఎస్ నాయకులు అన్నారు.




