Hyderabad: ఓయూకు రూ.1000 కోట్లు విడుదల చేయాలి..ఈ నెల 29న విద్యార్థి కవాతు!
Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి ప్రకటించిన రూ.1000 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న ఓయూలో బీఆర్‌ఎస్‌వీ విద్యార్థి కవాతు.
Hyderabad: ఓయూకు రూ.1000 కోట్లు విడుదల చేయాలి..ఈ నెల 29న విద్యార్థి కవాతు!
Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన రూ.1,000 కోట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న ఓయూలో విద్యార్థి కవాతు నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంపల్లి నరేష్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓయూ గెస్ట్‌హౌస్‌లో కవాతు గోడపత్రికను బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓయూకు రూ.1,000 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. సీఎం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయడంతో పాటు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈ నెల 29న నిర్వహించే శాంతియుత విద్యార్థి కవాతులో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సైదులు యాదవ్, కార్తీక్‌రెడ్డితో పాటు పలువురు బీఆర్‌ఎస్‌వీ విద్యార్థులు పాల్గొన్నారు.




