Hyderabad: బీఆర్‌ఎస్‌వీ నేత తుంగ బాలు హౌస్ అరెస్ట్

Hyderabad: విద్యా వారోత్సవాల కార్యక్రమం నేపథ్యంలో బీఆర్‌ఎస్‌వీ నేత తుంగ బాలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

HARISH, TARNAKA
Published on: 11 May 2026 3:26 PM IST
Hyderabad: బీఆర్‌ఎస్‌వీ నేత తుంగ బాలు హౌస్ అరెస్ట్
X

Hyderabad: నేటి సాయంత్రం ఎల్బీస్టేడియం లో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వారోత్సవాలు కార్యక్రమం సందర్భంగా బిఆర్ఎస్వి నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. తుంగ బాలు ను తార్నాక లోని ఆయన నివాసంలో ముందస్తుగా ఓయూ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తుంగ బాలు మాట్లాడుతూ ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఉన్నపలంగా తన నివాసంలో పోలీసులు ప్రవేశించి బలవంతంగా హౌస్ అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ తీవ్రంగా మండిపడ్డారూ.

విద్యార్థి నాయకులను నిర్బంధించి విద్యా వారోత్సవాల పేరుతో సంబురాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నా విద్యార్థులకు ఏమి ఇచ్చారని ప్రభుత్వం విద్యా వారోత్సవాలు చేస్తుందన్నారు.

విద్యార్థులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకుండా ఈ సంబరాలు చేయడాన్ని విమర్శించారు.

సంబురాల పేరుతో కోట్ల రూపాయల ప్రజా ధనంతో వృధా చేస్తూ, పేద మధ్యతరగతి విద్యార్థులకు చదువుకు దూరం చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కానే కాదు అని మండిపడ్డారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story