Tarnaka: ఓటర్ల తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేసిన ఎస్పీ అధ్యక్షుడు సింహాద్రి!

Tarnaka: ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని సమాజ్‌వాదీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్. సింహాద్రి డిమాండ్ చేశారు.

HARISH, TARNAKA
Published on: 26 Sept 2026 5:41 PM IST
Tarnaka
X

Tarnaka: ఓటర్ల తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేసిన ఎస్పీ అధ్యక్షుడు సింహాద్రి!

Tarnaka: ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను వెంటనే రద్దు చేసి, జనవరి 2025 ఓటర్ల జాబితా ఆధారంగా భవిష్యత్‌ ఎన్నికలు నిర్వహించాలని సమాజ్‌వాదీ పార్టీ తెలంగాణ డిమాండ్‌ చేసింది. తార్నాకలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీట్‌ ద ప్రెస్‌లో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎస్‌. సింహాద్రి మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భారీగా ఓటర్ల పేర్లు తొలగించే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.

తెలంగాణలో 3.38 కోట్ల మంది ఓటర్లలో 73.39 లక్షల మందిని గైర్హాజరు, తరలివెళ్లినవారు, మృతి చెందినవారు, డూప్లికేట్‌ ఓటర్ల కేటగిరీల్లో గుర్తించినట్లు తెలిపారు. ఇది మొత్తం ఓటర్లలో 21.7 శాతానికి సమానమని పేర్కొన్నారు. పేదలు, దళితులు, మహిళలు, వెనుకబడిన వర్గాలు, ముస్లింల ఓటు హక్కుకు నష్టం కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఓటర్ల జాబితాలో తప్పులు ఉంటే పారదర్శకంగా సరిచేయాలని, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల అక్రమాలపై ఆధారాలతో ఫిర్యాదులు, అఫిడవిట్లు సమర్పించినప్పటికీ ఎన్నికల సంఘం స్పందించలేదని ఆరోపించారు. ఓటు హక్కు పరిరక్షణకు ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరాముల శ్రీనివాస్‌, శ్రీహరి ముదిరాజ్‌, మహమ్మద్‌ రిజ్వాన్‌ హుస్సేన్‌, మహమ్మద్‌ వజీద్‌ సిద్ధిఖీ, రవికుమార్‌ భగెల్‌ తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA