Secunderabad: వైఎస్సార్ చూపిన మార్గంలోనే పేదలకు సేవ వార్డ్ అధ్యక్షుడు!
Secunderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒకటో వార్డులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి
Secunderabad: వైఎస్సార్ చూపిన మార్గంలోనే పేదలకు సేవ వార్డ్ అధ్యక్షుడు!
సికింద్రాబాద్: కంటోన్మెంట్ ఒకటో వార్డులో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను కంటోన్మెంట్ ఒకటో వార్డ్ అధ్యక్షుడు మారుతి గౌడ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మారుతి గౌడ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ చేసిన అభివృద్ధి పనులను స్మరించుకుంటూ వైయస్సార్ ఒక గొప్ప నాయకుడు అని పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండే వ్యక్తి అని కొనియాడారు ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ పేద ప్రజలకు మరింత అండగా ఉంటామని మారుతి గౌడ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో బోడు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, ముప్పిడి మధుకర్, సదానంద్, సాయిబాబా యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story




