Secunderabad: జింఖానాలో మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్ విజేతలకు మెడల్స్!
Secunderabad: సికింద్రాబాద్ జింఖానాలో మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్. విజేతలకు బహుమతులు అందజేసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్.
Secunderabad: జింఖానాలో మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్ విజేతలకు మెడల్స్!
Secunderabad: ఆల్ ఇండియా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలో 35 సంవత్సరాల పైబడిన వారికి సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో ఆదివారం నిర్వహించిన మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్‌కు ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు మెడల్స్, బహుమతులు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా, ఫిట్‌గా ఉండాలని ఆకాంక్షించారు. ఈ పోటీల్లో 95 సంవత్సరాల వయసు ఉన్న క్రీడాకారులు సైతం పాల్గొనడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ వయసులో కూడా వారు ఎంతో ఉత్సాహంతో, ఫిట్‌నెస్‌తో పోటీల్లో పాల్గొంటూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు.
క్లీన్ కంటోన్మెంట్‌తో పాటు ఫిట్ కంటోన్మెంట్‌ను నిర్మించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీగణేష్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ యువత క్రీడలు, వ్యాయామం వైపు దృష్టి సారించి ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
కంటోన్మెంట్‌లో క్రీడల అభివృద్ధికి మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సహకారం అందించాలని కోరిన ఎమ్మెల్యే, అసోసియేషన్‌కు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షులు మర్రి లక్ష్మణ్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, ఇఫ్కో మాజీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, ట్రెజరర్ శ్రీలక్ష్మి, బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీగణేష్‌కు అసోసియేషన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికి మెమోంటో అందజేశారు.




