Secunderabad: పద్మారావు నగర్ పార్కులో కేర్ హాస్పిటల్ ఉచిత హెల్త్ క్యాంప్!
Secunderabad: వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా సికింద్రాబాద్ పద్మారావు నగర్ పార్కులో కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించి, మధుమేహంపై వైద్యులు అవగాహన కల్పించారు.
Secunderabad: పద్మారావు నగర్ పార్కులో కేర్ హాస్పిటల్ ఉచిత హెల్త్ క్యాంప్!
Secunderabad: వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా పద్మారావు నగర్ పార్కులో కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ డయాబెటిస్ ను అదుపులో ఉంచుకునేందుకు ఉదయాన్నే వ్యాయామంతో పాటు ఆహార పదార్థాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఆహార నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
40 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి డయాబెటిస్ వైద్య పరీక్షలు చేయించుకొని నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. డయాబెటిస్ ను మొదటి దశలోనే అదుపులో ఉంచుకుంటే పేషెంట్ ఆరోగ్యం నిలకడగా ఉంటుందని, ఒకవేళ మొదటి దశలో నిర్లక్ష్యం చేస్తే అధిక షుగర్ వల్ల శరీర అవయవాలపై చెడు ప్రభావం పడుతుందని వైద్యులు తెలిపారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్య నియమాలు పాటించడం వల్ల తమ ఆరోగ్యం ఎల్లప్పుడూ మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు.




