Koltur: శ్రీ సాయి బేకరీపై కేసు నమోదు: నిషేధిత పదార్థాలు స్వాధీనం!
Koltur: శ్రీ సాయి బేకరీలో జీనోమ్ వ్యాలీ పోలీసులు SOT సంయుక్త తనిఖీలు నిర్వహించి నిషేధిత హానికర సింథటిక్ కలర్స్ ఫ్లేవర్స్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
Koltur: శ్రీ సాయి బేకరీపై కేసు నమోదు: నిషేధిత పదార్థాలు స్వాధీనం!
Koltur: ప్రభుత్వం నిషేధించిన హానికరమైన సింథటిక్ కలర్స్, మిక్స్‌డ్ ఫ్రూట్ ఫ్లేవర్స్‌ను వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా ఆహార పదార్థాలను తయారు చేస్తున్న బేకరీ యజమానిపై కేసు నమోదు చేసినట్లు జీనోమ్ వ్యాలీ సీఐ గోపగాని గురువయ్య గౌడ్ తెలిపారు.
సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు జీనోమ్ వ్యాలీ పోలీసులు, SOT కుత్బుల్లాపూర్ పోలీసులు సంయుక్తంగా కొల్తూరు గ్రామంలోని శ్రీ సాయి బేకరీలో తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల్లో ప్రభుత్వం నిషేధించిన సింథటిక్ కలర్స్, మిక్స్‌డ్ ఫ్రూట్ ఫ్లేవర్స్‌కు సంబంధించిన 18.5 లీటర్ల ద్రవ పదార్థాలు, అలాగే *2.5 కిలోల Dezo Cocoa (చాక్లెట్ పౌడర్)*ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా బేకరీలో ఉన్న కనకయ్య (40), వృత్తి: వ్యాపారం, కొట్యాల గ్రామం, మర్కూక్ మండలం, సిద్దిపేట జిల్లాకు చెందిన వ్యక్తిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న పదార్థాలను తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించే ప్రక్రియ చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రజల ఆరోగ్యానికి హానికరమైన, ప్రభుత్వం నిషేధించిన పదార్థాలను ఆహార తయారీలో వినియోగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జీనోమ్ వ్యాలీ సీఐ గోపగాని గురువయ్య గౌడ్ హెచ్చరించారు.




