Hyderabad: కొంపల్లిలో దొంగల హల్చల్.. రూ. 2 లక్షల నగదు, మోటార్లు చోరీ!
Hyderabad: కొంపల్లి శ్రీ సాయి దుర్గా పంప్స్ షాపులో దొంగలు పడి రూ.2 లక్షలు, మోటార్లు, సీసీటీవీ హార్డ్‌డిస్క్‌లు చోరీ చేశారు. పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad: కొంపల్లిలో దొంగల హల్చల్.. రూ. 2 లక్షల నగదు, మోటార్లు చోరీ!
Quthbullapur: పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోరీ ఘటన కలకలం రేపింది. కొంపల్లిలోని శ్రీ సాయి దుర్గా పంప్స్ అండ్ బోర్వెల్ దుకాణంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. షాపు పైకప్పు రేకులను తొలగించి లోపలికి ప్రవేశించిన దొంగలు క్యాష్ కౌంటర్లోని సుమారు రూ.2 లక్షల నగదుతోపాటు టెక్స్మో బోర్ మోటార్లను ఎత్తుకెళ్లారు.
అంతటితో ఆగకుండా, ఆధారాలు లభించకుండా చేసేందుకు దుకాణంలోని సీసీ కెమెరాలు, హార్డ్‌డిస్క్‌లను సైతం అపహరించారు. దీంతో నిందితులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. ఈ ఘటనపై దుకాణ యజమాని బండారి యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగల ఆచూకీ కోసం వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు.




