Amangal: మాజీ సర్పంచ్ ఎగిరిశెట్టి గోదాదేవి చొరవపై గ్రామస్థుల హర్షం!
Amangal: శెట్టిపల్లి-కట్టగండ్ల-ముద్విన్ రహదారి నిర్మాణానికి రూ.35 లక్షలతో ప్రతిపాదన.. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి వినతి
Amangal: మాజీ సర్పంచ్ ఎగిరిశెట్టి గోదాదేవి చొరవపై గ్రామస్థుల హర్షం!
Amangal: ఆమనగల్లు మండల పరిధి శెట్టిపల్లి గ్రామ అభివృద్ధిలో భాగంగా ప్రధాన రహదారి అభివృద్ధికి మరో ముందడుగు పడింది. శెట్టిపల్లి మాజీ సర్పంచ్ ఎగిరిశెట్టి గోదాదేవి సత్యం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసి శెట్టిపల్లి నుంచి కట్టగండ్ల మీదుగా ముద్విన్ వరకు ఉన్న ప్రధాన రహదారిని సీసీ రోడ్డుగా అభివృద్ధి చేయాలని ప్రజల తరఫున విజ్ఞప్తి చేశారు.
ఈ రహదారి గ్రామ ప్రజల రాకపోకలకు ఎంతో కీలకమైనదని, ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీసీ రోడ్డుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని గోదాదేవి సత్యం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకోసం సుమారు ₹35 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదనను సమర్పించారు.
ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ అంశాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె తెలిపారు. పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడమే నిజమైన ప్రజా నాయకత్వానికి నిదర్శనమని స్థానికులు పేర్కొన్నారు.ప్రజల సౌకర్యం కోసం నిరంతర కృషి.. శెట్టిపల్లి అభివృద్ధే లక్ష్యము అనే సంకల్పంతో గోదాదేవి సత్యం తీసుకున్న చొరవపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




