LB Nagar: సెన్సస్ 2027 మీ ఫోన్ నుండే మీ వివరాలు!

LB Nagar: ఎల్.బి. నగర్ జోన్ పరిధిలో సెన్సస్ 2027 అవగాహన రన్.

AJAY, HAYATH NAGAR
Published on: 9 May 2026 9:18 AM IST
LB Nagar
X

LB Nagar: సెన్సస్ 2027 మీ ఫోన్ నుండే మీ వివరాలు!

LB Nagar: రాబోయే సెన్సస్ 2027 (జనగణన) లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'సెల్ఫ్ ఎన్యుమరేషన్' (స్వీయ గణన) విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎల్.బి. నగర్ జోన్ పరిధిలో ఈరోజు 2 కిలోమీటర్ల అవగాహన రన్/వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారు మరియు నాగోల్ డిప్యూటీ కమిషనర్ శ్రీ నిత్యానంద్ గారు స్వయంగా పాల్గొని, జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ప్రతి పౌరుడు తమ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా స్వయంగా నమోదు చేసుకోవడం పట్ల చైతన్యవంతులు కావాలన్న ఉద్దేశంతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి మే 10, 2026 ఆఖరి తేదీ అని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కచ్చితమైన గణాంకాల సేకరణకు డిజిటల్ పద్ధతి ఎంతో దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు కోరారు. ఈ వాక్ లో మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story