Veldanda: వెల్దండలో శతాధిక వృద్ధురాలి మృతి.. గ్రామంలో విషాదం!

Veldanda: వెల్దండలో వందేళ్ల వృద్ధురాలు ఐనాల బక్కమ్మ మృతి. బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సాయం అందజేసిన గ్రామ సర్పంచ్ మహ్మద్‌ అన్వర్‌ పాషా.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 19 Sept 2026 10:55 PM IST
Veldanda
X

Veldanda: వెల్దండలో శతాధిక వృద్ధురాలి మృతి.. గ్రామంలో విషాదం!

వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం గ్రామానికి చెందిన ఐనాల బక్కమ్మ (100 సంవత్సరాలకు పైగా) వృద్ధాప్యంతో మృతి చెందారు. ఆమె మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బక్కమ్మ మృతి విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ మహ్మద్‌ అన్వర్‌ పాషా వెంటనే ఆమె నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

బాధిత కుటుంబాన్ని ఓదార్చి, తన వంతు సహాయంగా రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ అన్వర్‌ పాషా మాట్లాడుతూ.. బక్కమ్మ మృతి బాధాకరమని, ఆమె కుటుంబానికి తనతో పాటు గ్రామ పంచాయతీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య, గ్రామ నాయకులు దేవదానం, ప్రకాష్‌, భాస్కర్‌, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY