Vikarabad: తాండూరులో ఓటర్ల జాబితా సవరణ పరిశీలించిన సీఈవో సుదర్శన్‌రెడ్డి!

Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూరులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్.

Srikanth Reddy, Tandur
Published on: 25 Sept 2026 1:42 PM IST
Vikarabad
X

Vikarabad: తాండూరులో ఓటర్ల జాబితా సవరణ పరిశీలించిన సీఈవో సుదర్శన్‌రెడ్డి!

Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూరు ఎస్ ఐ ఆర్ ప్రక్రియ సజావుగా సాగుతుంది-రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి.

రాష్ట్రవ్యాప్తంగా సర్ ప్రక్రియ సజావుగా సాగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్డీఓ కార్యాలయం, పాత మున్సిపల్ కార్యాలయం,ఎంపిటీ హల్ తో పాటు తాండూరు మండలము గౌతాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ దీపక్ తివారి, ఆర్టీవో అనిత లతో కలసి పరిశీలించారు.

అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించిన క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ మరియు విచారణల ప్రక్రియ ప్రస్తుతం ముమ్మరంగా సాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నిబంధనల ప్రకారం ప్రక్రియను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారన్నారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం, ఓటర్లు తమ క్లెయిములు మరియు అభ్యంతరాలను దాఖలు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 7, 2026 వరకు గడువును పొడిగించిందన్నారు.

ఓటరు జాబితాలో తప్పులు లేదా 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ కుదరని కారణాల వల్ల రాష్ట్రంలో దాదాపు 92 లక్షల మందికి పైగా ఓటర్లకు నోటీసులు జారీ అయ్యాయి.తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియ 60శాతం పూర్తి కావడం జరిగిందన్నారు. ఓటర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నోటీసుల పరిష్కార ప్రక్రియను ప్రభుత్వం సరళతరం చేసింది.

నోటీసు అందుకున్న ఓటరుకు బదులుగా వారి కుటుంబంలోని ఏ వ్యక్తైనా అవసరమైన పత్రాలతో ఈఆర్ఓ లేదా ఏఈఆర్ఓ ల ఎదుట హాజరై వివరాలను సమర్పించవచ్చన్నారు. క్లెయిములు మరియు అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ నవంబర్ 5 నాటికి ముగుస్తుందని అనంతరం నవంబర్ 9, 2026న తెలంగాణ రాష్ట్ర తుది ఓటరు జాబితాను అధికారికంగా ప్రకటించనున్నామన్నారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur