Kukatpally: మహిళ మెడలో పుస్తెలతాడు లాకెళ్లిన నిందితుడు అరెస్ట్!
Kukatpally: కూకట్‌పల్లిలో బెట్టింగ్ యాప్‌ల బానిసగా మారి మహిళ మెడలో పుస్తెలతాడు లాక్కెళ్లిన నిందితుడు తుకారాం అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఏసీపీ నరేష్ రెడ్డి.
Kukatpally: మహిళ మెడలో పుస్తెలతాడు లాకెళ్లిన నిందితుడు అరెస్ట్!
Kukatpally: బెట్టింగ్ యాప్‌లకు బానిసై, ఓ వ్యక్తి మహిళ మెడలోని పుస్తెలతాడు లాక్కెళ్లిన ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బాలాజీనగర్ బస్టాప్ వద్ద ఓ మహిళ తన కుమార్తెను స్కూల్ బస్సు ఎక్కించేందుకు వెళ్లింది.
బస్సు మిస్ కావడంతో కూకట్‌పల్లి వై జంక్షన్ వరకు బస్సును అనుసరించి, అక్కడ తన కుమార్తెను బస్సు ఎక్కించింది. అనంతరం ఇంటికి వెళ్లేందుకు వై జంక్షన్ వద్ద రోడ్డు దాటుతుండగా.. కూకట్‌పల్లి నుంచి బాలానగర్ వైపు వెళ్తున్న ఓ వ్యక్తి ఆమె మెడలోని పుస్తెలతాడును లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కూకట్‌పల్లి ఇన్‌స్పెక్టర్ స్వామిగౌడ్ ఆధ్వర్యంలో డీఐ శంకర్‌రెడ్డి నేతృత్వంలోని క్రైమ్ బృందం సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితుడు తుకారాంను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.
బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు నష్టపోవడంతోనే దొంగతనానికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని ఏసీపీ నరేష్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా క్రైమ్ సిబ్బందిని ఏసీబీ అభినందించారు.




