Vikarabad: ఆపదలో ఉన్న రైతుకు అండగా చైతన్య కిరణ్ మల్కాపురం

Vikarabad: వ్యవసాయ నష్టాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి వికారాబాద్ మిషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రొంపల్లి రైతు రాజును చైతన్య కిరణ్ మల్కాపురం పరామర్శించి ఆర్థిక సాయం చేశారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 2 Nov 2026 10:50 PM IST
Vikarabad
X

Vikarabad: ఆపదలో ఉన్న రైతుకు అండగా చైతన్య కిరణ్ మల్కాపురం

వికారాబాద్: ఆపదలో ఉన్న రైతుకు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు బీఆర్ఎస్ నాయకుడు, అడ్వకేట్ చైతన్య కిరణ్ మల్కాపురం. వ్యవసాయంలో నష్టాల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి వికారాబాద్‌లోని మిషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంట్వారం మండలం రొంపల్లి గ్రామానికి చెందిన రైతు, బీఆర్ఎస్ కార్యకర్త రాజును ఆయన పరామర్శించారు.

రాజు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న చైతన్య కిరణ్, ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అలాగే, ఆపదలో ఉన్న రైతు కుటుంబానికి తన వంతుగా ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు.

ఈ సందర్భంగా చైతన్య కిరణ్ మల్కాపురం మాట్లాడుతూ, రైతుల కష్టాలను అర్థం చేసుకోవడం, ఆపద సమయంలో వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. వ్యవసాయంలో నష్టాలు ఎదురైనప్పుడు రైతులు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురికావడం బాధాకరమని పేర్కొన్నారు.

రైతులు ఎలాంటి కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఉండాలని, సమస్యలకు పరిష్కారం కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులు, సంబంధిత అధికారుల సహాయం తీసుకోవాలని సూచించారు. కష్టకాలంలో రైతులకు భరోసా కల్పించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

పార్టీ కార్యకర్తలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలవడాన్ని తన బాధ్యతగా భావిస్తానని తెలిపారు. రైతు రాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

“రైతు కన్నీటిని తుడవడం మన బాధ్యత.. కష్టకాలంలో భరోసా ఇవ్వడం మన ధర్మం. ఆపదలో ఉన్న రైతుకు అండగా నిలవడమే నిజమైన మానవత్వం” అని చైతన్య కిరణ్ మల్కాపురం పేర్కొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD