Chaitanyapuri: చైతన్యపురి పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా సహచరీల రాఖీ వేడుకలు

Chaitanyapuri: చైతన్యపురి పోలీసుల ఆధ్వర్యంలో కొత్తపేట మహిళా భవన్‌లో ‘మీ రక్ష - సహచరి’ కార్యక్రమంలో భాగంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 27 Aug 2026 7:16 PM IST
Chaitanyapuri
X

Chaitanyapuri: చైతన్యపురి పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా సహచరీల రాఖీ వేడుకలు

చైతన్యపురి: మహిళల భద్రత, గౌరవం కోసం పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారనే భరోసా కల్పిస్తూ.. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని చైతన్యపురి పోలీసులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

కొత్తపేట మహిళా భవన్‌ లో ‘ మీ రక్ష–సహచరి కార్యక్రమంలో భాగంగా సహచరీలతో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీసు సిబ్బంది సహచరీలకు రాఖీలు కట్టి.. ఆప్యాయత, సోదరభావాన్ని చాటుకున్నారు. అనంతరం వారికి బహుమతులు, స్వీట్లు అందజేశారు.

ఈ సందర్భంగా మల్కాజ్ గిరి పోలీస్ కమిషనర్ సుమతి మేడం రక్షాబంధన్ సందేశాన్ని సహచరీలకు చదివి వినిపించారు. మహిళల భద్రత, గౌరవం, సాధికారతకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.

ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకాన్ని మరింత బలోపేతం చేయడంలో సహచరీల పాత్ర కీలకమని పోలీసులు పేర్కొన్నారు. సామాజిక సమస్యలు, మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై సహచరీలతో చర్చించి అవగాహన కల్పించారు.

కార్యక్రమం పట్ల సహచరీలు సంతోషం వ్యక్తం చేస్తూ.. పోలీస్ కమిషనర్ మేడమ్‌తో పాటు చైతన్యపురి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

మహిళల రక్షణ.. గౌరవం.. సాధికారతే లక్ష్యంగా.. కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని చైతన్యపురి పోలీసులు స్పష్టం చేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story