Hyderabad: రవీంద్రభారతిలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ వర్ధంతి వేడుకలు!
Hyderabad: సెప్టెంబర్ 26న రవీంద్రభారతిలో వీరవనిత చాకలి ఐలమ్మ 131వ వర్ధంతి. కార్యక్రమ కన్వీనర్‌గా నియమితులైన ఆమనగల్లు మున్సిపల్ కౌన్సిలర్ నాగిళ్ల జగన్.
Hyderabad: రవీంద్రభారతిలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ వర్ధంతి వేడుకలు!
Hyderabad: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ వీరవనిత చాకలి ఐలమ్మ 131వ వర్ధంతి కార్యక్రమానికి ఆమనగల్లు మున్సిపల్ కౌన్సిలర్ నాగిళ్ల జగన్ కన్వీనర్‌గా నియమితులయ్యారు. సెప్టెంబర్ 26న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి తనను కన్వీనర్‌గా నియమించినందుకు రజక అభివృద్ధి సంస్థకు నాగిళ్ల జగన్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి, ధైర్యం, ఆత్మగౌరవం సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని రజక సమాజ అభివృద్ధి, సంక్షేమం కోసం ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.




