Kadthal: చాకలి ఐలమ్మ జయంతిని విజయవంతం చేయాలి: రవికుమార్

Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామంలో సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు రజక సంఘం ప్రకటించింది.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 25 Sept 2026 6:43 PM IST
Kadthal
X

Kadthal: చాకలి ఐలమ్మ జయంతిని విజయవంతం చేయాలి: రవికుమార్

రంగారెడ్డి జిల్లా: కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామంలో ఈనెల 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ వార్డు సభ్యుడు, రజక సంఘం అధ్యక్షుడు సోమరాజు రవికుమార్ తెలిపారు.

ఉదయం 9 గంటలకు ఐలమ్మ విగ్రహం వద్ద జయంతి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, నాయకులు, యువత, మహిళలు, రజక సంఘం సోదర సోదరీమణులు, అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సోమరాజు రవికుమార్ కోరారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY