Malkajgiri: గణేష్ ఉత్సవ సమితి కో-కన్వీనర్‌గా చల్లా ప్రభాకర్

Malkajgiri: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మల్కాజిగిరి పార్లమెంట్ కో-కన్వీనర్‌గా చల్లా ప్రభాకర్ నియామకం. శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడి.

ASHOK, KAPRA
Published on: 19 Aug 2026 6:35 PM IST
Malkajgiri
X

Malkajgiri: గణేష్ ఉత్సవ సమితి కో-కన్వీనర్‌గా చల్లా ప్రభాకర్

మల్కాజిగిరి: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మల్కాజిగిరి పార్లమెంట్ కమిటీ సమావేశం మంగళవారం మల్కాజిగిరిలోని సమితి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్, కార్యదర్శి నాని బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కుషాయిగూడకు చెందిన చల్లా ప్రభాకర్‌ను మల్కాజిగిరి పార్లమెంట్ కో-కన్వీనర్‌గా నియమించారు. నూతన బాధ్యతలు స్వీకరించిన చల్లా ప్రభాకర్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో కీలకమైన బాధ్యతను అప్పగించిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

తనకు అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వర్తిస్తానని చెప్పారు. హిందూ ధర్మాన్ని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించే విధంగా కృషి చేస్తానని ప్రభాకర్ తెలిపారు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోని గణేష్ ఉత్సవ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలను నిర్వహిస్తామని అన్నారు.

సంబంధిత ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని గణేష్ ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని చల్లా ప్రభాకర్ స్పష్టం చేశారు. భక్తులు, నిర్వాహకులు, ప్రజలు సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story