Chandanagar: చందానగర్ గంగారంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పర్యటన
Chandanagar: చందానగర్ గంగారంలో ఆలయాలను పరిశీలించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవికుమార్ యాదవ్. మెట్రో, రోడ్డు విస్తరణలో ఆలయాలు దెబ్బతినకుండా ప్లాన్ మార్పుకు హామీ.
Chandanagar: చందానగర్ గంగారంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పర్యటన
చందానగర్: చందానగర్ గంగారం గ్రామంలో పర్యటించిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్
ఆలయ నిర్మాణం దెబ్బతినకుండా ప్లాన్ మర్పించే విధంగా మరియు పోచమ్మ ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించేలా సంబంధిత అధికారులతో మాట్లాడి కృషి చేస్తామని హామీ ఇచ్చిన...చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి,బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్
ఈరోజు మియాపూర్ నుండి పఠాన్ చెరువు వరకు చేపట్టబోతున్న మెట్రో రైల్వే లైన్ , ఫ్లైఓవర్ పనులు మరియు రోడ్ విస్తరణ పనుల వలన చందానగర్ గంగారం గ్రామంలోనీ రామాలయం , ఆంజనేయ స్వామి ఆలయ గోపురాలు దెబ్బతినే అవకాశం ఉందని మరియు పోచమ్మ ఆలయం పూర్తిగా తీసివేయాల్సిన వస్తున్న పరిస్తితుల్లో గంగారం గ్రామస్తులతో కలిసి పరిసర ప్రాంతాల్లో పర్యటించిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ నుండి పఠాన్ చెరువు వరకు చేపట్టబోతున్న మెట్రో రైల్వే లైన్ , ఫ్లైఓవర్ పనులు మరియు రోడ్ విస్తరణ పనుల వలన గంగారం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం పై గోపురం దెబ్బతినే అవకాశం ఉందని అలాగే పోచమ్మ ఆలయం పూర్తిగా తీసివేయాల్సిన పరిస్థితి ఉందని గంగారాం గ్రామస్తులు కోరగా
ఈరోజు గంగారం గ్రామస్తులతో కలిసి ఆలయ పరిసర ప్రాంతాన్ని సందర్శించి గ్రామస్తులతో మాట్లాడటం జరిగిందని, గ్రామస్తులు కూడా అభివృద్ధి అడ్డుకొబోమని చేపట్టబోయే మెట్రో రైలు లైన్ మరియు ఫ్లైఓవర్ పనుల ప్లాన్ కొంచెం మారిస్తే సరిపోతుందని అలాగే పోచమ్మ అమ్మవారి ఆలయం నిర్మాణం కొరకు గ్రామంలో స్థలం కేటాయించాలని కోరారన్నారు.
ఈ సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో మహిపాల్ రెడ్డి ,జితేందర్ ,దేవాల్ యాదవ్, అనిల్ గౌడ్, రామకృష్ణ గౌడ్, రాజు, రాజేందర్, అర్జున్, సాయి కిరణ్ ,అశోక్ ,భాస్కర్, శ్రావణ్ స్వామి, పవన్, సత్యనారాయణ రాజు ,శ్రీనివాస్ యాదవ్, సురేష్ మొదలగువారు పాల్గొన్నారు.




