Amanagal: చంద్రాయణ్ పల్లి తండాలో వినాయక మండప భూమి పూజలో సుంకిరెడ్డి!
Amanagal: ఆమనగల్ చంద్రాయణ్ పల్లి తండాలో వినాయక మండప భూమి పూజలో పాల్గొన్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి. యువతకు ఉద్యోగ భరోసా.
Amanagal: చంద్రాయణ్ పల్లి తండాలో వినాయక మండప భూమి పూజలో సుంకిరెడ్డి!
Amanagal: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని , చంద్రాయణ్ పల్లి తండా ఈరోజు నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు & TASK C.O.O. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చంద్రాయణ్ పల్లి తండాలో పర్యటించారు..
ఈ సందర్భంగా నూతనంగా నిర్మించనున్న వినాయక మండపానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు,
ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయక మండపం తండా ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందని, విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, శాంతి, ఆరోగ్యం, అభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు, మండపం నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇస్తూ,తండా ప్రజల అందరి సహకారంతో మండపం నిర్మాణం త్వరిత గతిన పూర్తి చేసుకొని అందుబాటులోకి తీసుకొద్దామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అనంతరం తండాలోని బుడియా బాబా మరియు ఇతర ఆలయాలను సందర్శించిన సుంకిరెడ్డి గారు ఆలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాకుండా.. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను భావితరాలకు అందించే పవిత్ర కేంద్రాలని అన్నారు,తండాల్లోని ఆలయాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తామని తెలిపారు.
అనంతరం నిరుద్యోగ యువతకు అండగా తండాలోని నిరుద్యోగ యువతతో ముఖాముఖిగా మాట్లాడి వారి ఉద్యోగ ప్రయత్నాలు, అవసరాలను తెలుసుకున్నారు,గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, జాబ్ డ్రైవ్‌లు, ఉద్యోగ అవకాశాలను ఐక్యత ఫౌండేషన్ ద్వారా అందుబాటులోకి తీసుకువస్తున్నామని వివరించారు, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ యువతకు అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని,యువత భవిష్యత్తుకు అండగా నిలవడమే తమ ప్రధాన లక్ష్యమని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు..
ఈ కార్యక్రమంలో మండపం అభివృద్ధి కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు రాగ్యా నాయక్, రమేష్,గోపాల్,కుమార్,దేవ రాజ్,జగదీష్,మల్లేష్, రవి,సక్రు, చంద్రు, రూప్సింగ్, లాల్ కోటి, గోపి లతో పాటు తదితరులు పాల్గొన్నారు.




