Uppal: ఉప్పల్ రూట్ మ్యాప్ ఛేంజ్.. ఇకపై ఇక్కడి నుంచే బస్సులు!

Uppal: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఉప్పల్ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ మరియు బస్ స్టాప్ మార్పులు!

KARUNAKAR, UPPAL
Published on: 26 April 2026 7:20 AM IST
Uppal
X

Uppal: ఉప్పల్ రూట్ మ్యాప్ ఛేంజ్.. ఇకపై ఇక్కడి నుంచే బస్సులు!

ఉప్పల్: ఉప్పల్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా కీలక సూచనలు జారీ చేశారు. ఉప్పల్ రింగ్ రోడ్డులో ఉన్న వరంగల్, హనుమకొండ, యాదగిరిగుట్ట, తొర్రూర్, బస్సుల స్టాప్‌ను తాత్కాలికంగా ఉప్పల్ నల్ల చెరువు కట్ట సమీపానికి మార్చారు. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇకపై ఉప్పల్ నల్ల చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్ స్టాప్ నుంచే బస్సులు ఎక్కాల్సి ఉంటుంది. ఈ మార్పును గమనించి ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని రాధిక గుప్తా సూచించారు. ఇక ట్రాఫిక్ పరంగా కూడా కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. నేటి ఉదయం నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డులో వరంగల్ వైపు వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేయనున్నారు. దీనివల్ల ట్రాఫిక్ మళ్లింపులు ఉండే అవకాశం ఉన్నందున వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. ప్రజల సౌకర్యార్థం, ట్రాఫిక్ నియంత్రణ దృష్ట్యా పోలీసు శాఖ, ఇతర సంబంధిత అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిర్మాణ పనులు సాఫీగా సాగేందుకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story