Kukatpally: కూకట్‌పల్లి ఇందిరమ్మ ఇళ్ల లాటరీలో గందరగోళం డ్రా నిలిపివేత

Kukatpally: కూకట్‌పల్లి ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ లాటరీలో గందరగోళం. ఎస్సీ కేటగిరీ జాబితాలో ఓబీసీ అభ్యర్థుల పేర్లు రావడంపై దరఖాస్తుదారుల ఆందోళన, తాత్కాలికంగా నిలిచిన డ్రా.

Maruthisagar, Kukatpally
Published on: 29 Aug 2026 1:21 PM IST
Kukatpally
X

Kukatpally: కూకట్‌పల్లి ఇందిరమ్మ ఇళ్ల లాటరీలో గందరగోళం డ్రా నిలిపివేత

Kukatpally: కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించిన లాటరీలో గందరగోళం నెలకొంది. ఎస్సీ కేటగిరీలో ఓబీసీ అభ్యర్థుల పేర్లు రావడంపై దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ కేటగిరీలో ఓబీసీ అభ్యర్థుల పేర్లు ఎలా వచ్చాయంటూ అధికారులను దరఖాస్తుదారులు ప్రశ్నించారు.

తమకు అన్యాయం జరుగుతోందంటూ పలువురు దరఖాస్తుదారులు స్టేజ్‌పైకి వెళ్లి ఎస్సీ, ఓబీసీ హౌసింగ్ బోర్డు అధికారులను నిలదీశారు. దీంతో అధికారులు, దరఖాస్తుదారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీనితో తాత్కాలికంగా డ్రా ఎంపిక నిలిచిపోయింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని, తమకు న్యాయం చేయాలని దరఖాస్తుదారులు డిమాండ్ చేశారు.

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally

Next Story