Charminar: గణేష్ నిమజ్జనం: చార్మినార్ జోన్‌లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్

Charminar: చార్మినార్ జోన్ పరిధిలో గణేష్ నిమజ్జనం సందర్భంగా 5 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. రూమర్స్ నమ్మవద్దని డీసీపీ హెచ్చరించారు.

SYED MUJTABA HUSSAIN, OLD CITY
Published on: 25 Sept 2026 4:06 PM IST
Charminar
X

Charminar: గణేష్ నిమజ్జనం: చార్మినార్ జోన్‌లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్

Charminar: చార్మినార్ జోన్ పరిధిలో సుమారు 5 వేల మంది పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. 27 మంది ట్రైనీ ఐపీఎస్‌లు, ఇద్దరు డీజీ స్థాయి అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

అవసరమైన ప్రాంతాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను కూడా మోహరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిమజ్జన కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చార్మినార్ జోన్‌లో హిందువులు, ముస్లింలు కలిసి నివసిస్తున్న నేపథ్యంలో... గత కొద్దిరోజులుగా ముస్లిం శాంతి కమిటీ సభ్యులు, గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో పోలీసులు సమావేశాలు నిర్వహించారు.

శుక్రవారం ప్రార్థనలు జరిగే ప్రాంతాలు, సమయాలతో పాటు... గణేష్ శోభాయాత్రలు వెళ్లే మార్గాలపై కూడా ముందస్తుగా చర్చించి ఏర్పాట్లు చేశారు.

ఇక బాలాపూర్ గణేష్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:30 గంటల మధ్య చార్మినార్ జోన్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

అయితే సోషల్ మీడియాలో కొందరు తప్పుడు వార్తలు, రూమర్స్ ప్రచారం చేస్తున్నారని... రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని పోలీసులు హెచ్చరించారు.

అధికారికంగా పోలీసులు ప్రకటించే సమాచారాన్ని మాత్రమే ప్రజలు నమ్మాలని... అవాస్తవ వార్తలను నమ్మవద్దని చార్మినార్ డీసీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

SYED MUJTABA HUSSAIN, OLD CITY

SYED MUJTABA HUSSAIN, OLD CITY