Charminar: అబ్దుల్ రాషెద్ ఖాన్ అరెస్ట్ 15 నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం

Charminar: మీర్‌చౌక్ పోలీసులు విదేశాలకు వెళ్లే వారికి నకిలీ విద్యా సర్టిఫికెట్లు అమ్ముతున్న అంతర్రాష్ట్ర రాకెట్‌ను పట్టుకున్నారు. అబ్దుల్ రాషెద్ ఖాన్‌ను అరెస్ట్

SYED MUJTABA HUSSAIN, OLD CITY
Published on: 8 July 2026 11:27 PM IST
Charminar
X

Charminar: అబ్దుల్ రాషెద్ ఖాన్ అరెస్ట్ 15 నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం

చార్మినార్: ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్ళేవారికి నకిలీ విద్యా సర్టిఫికెట్లు తయారు చేసి ఇస్తున్న నిందితున్ని అరెస్ట్ చేసిన మీర్ చౌక్ పొలిసులు.

ఈ నెల 7వ తేదీన ఒక వ్యక్తి నకిలీ విద్యా ధృవపత్రాలతో సుమారు 11:00 గంటలకు మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధి ఎతెబార్ చౌక్‌కు వస్తాడని సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ సి. అనితకు విశ్వసనీయ సమాచారం అందింది.

దీనిపై, ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి పొంది, నకిలీ విద్యా ధృవపత్రాలను కలిగి ఉన్న అబ్దుల్ రాషెద్ ఖాన్ అనే నిందితున్ని అరెస్టు చేసి అతని వద్ద నుండి 15 నకిలీ విద్యా ధృవపత్రాలు, ఒక వివో ఫోన్, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకొని విచారించగా

ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన వారికి నకిలీ విద్యా ధృవపత్రాలను తయారు చేసి అమ్ముతున్నట్లు తెలిసింది.పట్టుబడ్డ నిందితుడు మరో ఇద్దరి సహాయంతో ఈ రాకెట్ నిర్వహిస్తున్నట్లు,13సర్టిఫికెట్లు ఎస్ ఏం ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స ఐన్డ్ టెక్నోలజీ,తమిళనాడు.

2సర్టిఫికెట్లు మహారాష్ట్ర సంబంధించి దొరికాయి.కేసును చేధించిన పోలిస్ సిబ్బందిని చార్మినార్ జోన్ డిసిపి అభినందించారు.

SYED MUJTABA HUSSAIN, OLD CITY

SYED MUJTABA HUSSAIN, OLD CITY

Next Story