Hyderabad: పాతబస్తీలో పోలీసుల మెరుపు దాడులు.. లాడ్జీల్లో హుక్కా పాట్లు!

Hyderabad: హైదరాబాద్ చార్మినార్ జోన్‌లో పోలీసుల భారీ సోదాలు. 48 లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించి హుక్కా పాట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA
Published on: 6 Jun 2026 8:32 AM IST
Hyderabad
X

Hyderabad: పాతబస్తీలో పోలీసుల మెరుపు దాడులు.. లాడ్జీల్లో హుక్కా పాట్లు!

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో అసాంఘిక, నేర కార్యకలాపాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో చార్మినార్ జోన్ పరిధిలోని 48 లాడ్జీలు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

చార్మినార్, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, సైదాబాద్, చాదర్‌ఘాట్, సంతోష్‌నగర్, అఫ్జల్‌గంజ్ ప్రాంతాల్లోని లాడ్జీలలో బస చేస్తున్న వారి ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు పత్రాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం లేకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

తనిఖీల సందర్భంగా అనుమానాస్పద వ్యక్తులకు డ్రగ్స్ ర్యాపిడ్ టెస్టులు నిర్వహించినట్లు డీసీపీ కిరణ్ ఖారే తెలిపారు. అలాగే కొన్ని లాడ్జీలలో హుక్కా పాట్లు గుర్తించినట్లు, సంబంధిత యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

లాడ్జీలు, హోటళ్లలో అతిథుల పూర్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని డీసీపీ హెచ్చరించారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా ఇటువంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA

MOHD MOHIUDDIN, YAKUTHAPURA

Next Story