Chengicherla: చెంగిచెర్లలో అంబరాన్నంటిన సదర్ సంబరాలు: అజయ్ యాదవ్!
Chengicherla: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా చెంగిచెర్ల క్రాంతి కాలనీలో శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం ఘనంగా జరిగింది. మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
Chengicherla: చెంగిచెర్లలో అంబరాన్నంటిన సదర్ సంబరాలు: అజయ్ యాదవ్!
చెంగిచెర్ల: మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని చెంగిచెర్ల డివిజన్ క్రాంతి కాలనీలో శ్రీకృష్ణ సదర్ సమ్మేళన వేడుకలు అంబరాన్నంటాయి. యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు యాదవ సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తోటకూర అజయ్ యాదవ్ మాట్లాడుతూ.. శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం యాదవుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే గొప్ప వేడుక అని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి సమ్మేళనాలు దోహదపడతాయని అన్నారు.
యాదవులంతా ఐకమత్యంతో ముందుకు సాగుతూ సామాజిక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. వేడుకల సందర్భంగా కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. యాదవ సంఘం నాయకులు, నిర్వాహకులు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బింగి జంగయ్య, గుర్రాల వెంకటేష్, మల్లేష్, యాదవ సంఘం నాయకులు, నిర్వాహకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, కాలనీ వాసులు, యాదవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




