Chevella: పేదల సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యం: చేవెళ్ల ఇన్‌చార్జ్ భీమ్ భరత్
Chevella: మొయినాబాద్ మండలం ఎల్కగూడలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో చేవెళ్ల కాంగ్రెస్ ఇన్‌చార్జ్ భీమ్ భరత్ పాల్గొని ప్రారంభించారు.
Chevella: పేదల సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యం: చేవెళ్ల ఇన్‌చార్జ్ భీమ్ భరత్
చేవెళ్ల: మొయినాబాద్ మండలం ఎల్కగూడ గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తి కావడంతో గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ హాజరై ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు పతకం లో బాగంగా ఇల్లు నిర్మాణం పూర్తికావడం లబ్దిదారులు నూతన గృహప్రవేశం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్‌రెడ్డి కి చేవెళ్ళ నియోజకవర్గ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్ మొయినాబాద్ మండలం మాజీ అధ్యక్షుడు మానయ్య, మండల పార్టీ అధ్యక్షుడు సత్య నారాయణ ,బిక్షపతి , లేబర్ సెల్ నాయకులు శంకర్ గౌడ్ , మినజుద్దీన్ , విజయ్ కుమార్, షమీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.




