Chevella: గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసిన డీసీపీ.. ఏర్పాట్ల పరిశీలన!
Chevella: షాబాద్లో బాడా గణేష్ ఉత్సవ సమితి మండపాన్ని సందర్శించిన చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్. ప్రత్యేక పూజలు నిర్వహించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
Chevella: గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసిన డీసీపీ.. ఏర్పాట్ల పరిశీలన!
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో బాడా గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు.
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపం వద్ద భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను డీసీపీ పరిశీలించారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో కొనసాగాలని నిర్వాహకులకు సూచించారు. మండపం ఏర్పాటు చేసిన తీరును పరిశీలించిన డీసీపీ యోగేష్ గౌతమ్.. “గణేష్ మండపం చాలా బాగుంది” అంటూ నిర్వాహకులను అభినందించారు. మండప నిర్మాణం ఎప్పుడు ప్రారంభించారని నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
39 ఏళ్లుగా బాడా గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు నిరవిఘ్నంగా కొనసాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో షాబాద్ సీఐ లక్ష్మీ రెడ్డి మరియు షాబాద్ సర్పంచ్ అశోక్, ఉత్సవ సమితి సభ్యులు ధర్పల్లి రవీందర్ గౌడ్, రామకృష్ణ, కావాలి బాలరాజ్, లంబాడీ రాము , జకాని శేఖర్ ,సత్యం తదితరులు డీజీపీకి స్వాగతం పలికారు.




