Chevella: 50 శాతం సబ్సిడీతో పచ్చిరొట్టె విత్తనాలు షాబాద్ PACSలో రైతులకు పంపిణీ
Chevella: రంగారెడ్డి జిల్లా షాబాద్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో సబ్సిడీపై జనుము, జీలుగ పచ్చిరొట్టె విత్తనాల పంపిణీ.
Chevella: 50 శాతం సబ్సిడీతో పచ్చిరొట్టె విత్తనాలు షాబాద్ PACSలో రైతులకు పంపిణీ
చేవెళ్ల: షాబాద్ పీఏసీఎస్ కో-ఆపరేటివ్ సొసైటీలో పచ్చిరొట్టె విత్తనాలు జనుము సబ్సిడీపై పచ్చిరొట్టె ఎరువుల విత్తనాలు పంపిణి కార్యక్రమంలో చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య తో కలిసి పాల్గొన్న రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన రెడ్డి.
జనుము విత్తనాల క్వింటా పూర్తి ధర: రూ. 15,550/-
సబ్సిడీ: 50% రూ.7,775/-
రైతు చెల్లించవలసిన మొత్తం: రూ. 7775/-
40 కిలోల బస్తా ధర: రూ. 3110/-.
జీలుగ విత్తనాల క్వింటా పూర్తి ధర: రూ. 16,350/-
సబ్సిడీ: 50% రూ.8,175/-
రైతు చెల్లించవలసిన మొత్తం: రూ. 8,175/-.
అధికంగా రసాయన ఎరువులు వాడటం వల్ల భూసారం తగ్గి, దిగుబడులు క్షీణిస్తున్నాయి. ఫలితంగా రైతులకు పెట్టుబడి ఖర్చులు అధికమవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట జనుము, జీలుగు విత్తనాల ఎరువులనుసాగు చేసి, భూసారాన్ని మరియు పంట దిగుబడులను పెంచుకోవచ్చు. పచ్చిరొట్ట ఎరువుల వల్ల భూమి గుల్లబారి, వర్షపు నీరు భూమిలోకి బాగా ఇంకుతుంది.
నేలలో సేంద్రియ పదార్థం చేరడంతో సూక్ష్మజీవులు వృద్ధి చెంది, జీవ రసాయనిక చర్యల ద్వారా నేల సారం, ఉత్పాదకత సామర్థ్యం పెరుగుతాయి. అలాగే ఇది కలుపు మొక్కలు పెరగకుండా నివారిస్తుంది. పచ్చిరొట్ట ఎరువుల పంట పూత దశకు రాగానే నేలలో కలియదున్నడం ద్వారా అధిక పరిమాణంలో నేలకు పోషకాలు అందుతాయి. ఈ కార్యక్రమంలో సర్దారనగర్ మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి,గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావాలి చంద్రశేఖర్,లబ్ధిదారులు,కార్యకర్తలు పాల్గొన్నారు.




