Vikarabad: 25న వికారాబాద్ నిమజ్జన శోభాయాత్రకు అందరూ సహకరించాలి!
Vikarabad: ఈ నెల 25న వికారాబాద్‌లో వినాయక నిమజ్జన శోభాయాత్ర. సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షుడు రమేష్ కుమార్ కోరిక.
Vikarabad: 25న వికారాబాద్ నిమజ్జన శోభాయాత్రకు అందరూ సహకరించాలి!
Vikarabad: ఈనెల 25న వికారాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించబోయే వినాయక నిమజ్జనం శోభాయాత్ర కార్యక్రమానికి అందరూ సహకరించాలని వికారాబాద్ పట్టణ ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు చిగుళ్లపల్లి రమేష్ కుమార్ గారు కోరారు.
ఈరోజు వికారాబాద్ పట్టణంలోని వివిధ వినాయక మండపాలను సందర్శించిన ఆయన మండపాల నిర్వాహకులు, స్థానిక నాయకులు, యువకులు, భక్తులతో మాట్లాడారు. గతంలో లాగా శోభయాత్ర కార్యక్రమాన్ని సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
25వ తేదీన సాయంత్రం 5 గంటల లోపు ఆలంపల్లి ప్రధాన రోడ్డు న్యూ గంజిలోకి మీమీ వినాయకుడి విగ్రహాలు చేరుకునేలా పక్క ప్రణాళికతో బయలుదేరాలని సూచించారు. ఈ సందర్భంగా చిగుళ్లపల్లి రమేష్ కుమార్ గారిని స్థానిక నాయకులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మండపాల నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




