Chikkadpally: చిక్కడపల్లి పిఎస్‌లో ఎస్పీఓ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి

Chikkadpally: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో ఎస్పీఓ కానిస్టేబుల్ నాగార్జున రెడ్డి మృతి. శ్రీకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణం.

GIRI, CENTRAL ZONE
Published on: 28 July 2026 2:32 PM IST
Chikkadpally
X

Chikkadpally: చిక్కడపల్లి పిఎస్‌లో ఎస్పీఓ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి

చిక్కడపల్లి: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విధి నిర్వహణలో ఉన్న ఎస్ పి ఓ కానిస్టేబుల్ నాగార్జున రెడ్డి (60) గుండెపోటు తో ఆర్టీసీ క్రాస్ రోడ్ శ్రీ శ్రీకర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి మల్కాజ్గిరి ప్రాంతంలో నివాసం ఉండే నాగార్జున రెడ్డికి భార్య, ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు.

ఆర్మీలో రిటైర్ అయిన తర్వాత ఎస్పీఓలో చేరి దోమలగూడ చిక్కడపల్లి తదితర పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించాడు.

ప్రతిరోజు మల్కాజ్గిరి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించేందుకు ఎప్పటిలాగే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు.

గుండెపోటు రావడంతో వెంటనే పోలీస్ సిబ్బంది సమీపంలో ఉన్న శ్రీకర్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు...

ఆర్టీసీ క్రాస్ రోడ్డు లోని శ్రీకర్ ఆసుపత్రిలో నాగార్జున రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చిక్కడపల్లి సిఐ మధుబాబు తెలిపారు.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE

Next Story