గ్రామ సభలో ఏకగ్రీవ తీర్మానం.. ప్రాజెక్టును విరమించుకోవాల్సిందే!

Chinna Ravirala: చిన్న రావిరాల పరిధిలోని సర్వే నంబర్ 268లో 494 ఎకరాల్లో ప్రభుత్వం ప్రతిపాదించిన ఏకో టౌన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ అత్యవసర గ్రామ సభ నిర్వహించారు.

AJAY, HAYATH NAGAR
Published on: 2 May 2026 2:51 PM IST
Chinna Ravirala
X

గ్రామ సభలో ఏకగ్రీవ తీర్మానం.. ప్రాజెక్టును విరమించుకోవాల్సిందే!

Chinna Ravirala: గ్రామపంచాయతీ కార్యాలయంలో, చిన్న రావిరాల గ్రామంలోని *సర్వే నెంబర్ 268లో 494 ఎకరాలలో ఏకో టౌన్ ( యూనిట్ )ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అత్యవసర గ్రామ సభ నిర్వహించబడింది. ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ వల్ల గ్రామ ప్రజలకు కలిగే ఇబ్బందులను వివరించి, గ్రామ అభివృద్ధికి హాని కలిగించే ఏ నిర్ణయాన్నైనా పార్టీలకు అతీతంగా మనమంతా కలిసి వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో గ్రామ ప్రజలందరూ కలిసి, ఏకో టౌన్ (యూనిట్ )ప్రతిపాదనకు వ్యతిరేకంగా గ్రామ సభ లో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ కవాడి ( సద్దిపల్లి )శిరీష శివారెడ్డి గారితో పాటు వార్డ్ సభ్యులు శ్రీమతి బండారి అనిత గారు, శ్రీ ఆకిటి రామకృష్ణ రెడ్డి గారు,, శ్రీ అబ్బావతి బాలయ్య గారు, శ్రీమతి నారెడ్డి రిషితా సతీష్ రెడ్డి గారు , శ్రీ రాపోలు మల్లేష్ గారు, శ్రీ బండారి సత్యనారాయణ గారు, శ్రీమతి చెరుకు భాగ్యలక్ష్మి గారు, మాజీ సర్పంచ్ లు, గ్రామ పెద్దలు,గ్రామ నాయకులు , యువజన నాయకులు,మరియు ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం ఏకో టౌన్ ఏర్పాటు తక్షణమే విరమించుకోకపోతే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమేనని గ్రామ ప్రజలు ముక్తకంఠoగా హెచ్చరించారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story