Bachupally: బాచుపల్లిలో గ్రామసభ నిర్వహణ!

Bachupally: గుత్తి మండలం బాచుపల్లిలో గ్రామసభ. సైబర్ క్రైమ్, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన సీఐ రామారావు. ఎన్నికల్లో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 14 Aug 2026 6:59 AM IST
Bachupally
X

Bachupally: బాచుపల్లిలో గ్రామసభ నిర్వహణ!

Bachupally: అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లి గ్రామంలో గుత్తి సీఐ రామారావు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.

ఈ సభలో సీఐ రామారావు మరియు పోలీస్ సిబ్బంది మాట్లాడుతూ ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.

సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఏదైనా అత్యవసర సమయంలో డయల్ 100 మరియు డయల్ 112 నెంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు.

అలాగే బాల్య వివాహాలు, గంజాయి మరియు డ్రగ్స్ వంటి సామాజిక దురలవాట్లపై గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన ఎడల అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సీఐ రామారావు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story